![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -478 లో.. కృష్ణకి మీరా ప్రెగ్నెంట్ అనే నిజం తెలిసిపోయి తనని అడుగగా.. నేను ఇదంతా కావాలనే చేశాను. అసలు నీకు పిల్లలు పెట్టుకుండా చేసిందే నేను.. మురారీకి సరోగసి ఐడియా ఇచ్చిందే నేను. ఆ బిడ్డను కడుపులో పెట్టుకుని ఆదర్శ్‌తో పెళ్లి ఏర్పాట్లు చేయిస్తున్నదే నేను అని మీరా చెప్తుంది. ఇంత ఘోరాలు చెయ్యడానికి అసలు నువ్వు ఎవరు? నీకు నా కుటుంబానికి ఏంటి సంబంధమని కృష్ణ నిలదీయగా.. నేనే అసలు ముకుందను.. చనిపోయినట్లుగా మిమ్మల్ని నమ్మించి.. ఇలా రూపం మార్చుకుని మీ ఇంట్లో అడుగుపెట్టాను.. ఈ నిజం ఎవరితోనైనా చెప్పాలని చూస్తే.. నిజంగానే నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది మీరా అలియాస్ ముకుంద.
ఇక ప్రభాకర్ ని చూడడానికి కృష్ణ వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక భవాని ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగగా.. బాగానే ఉన్నా పెద్దత్తయ్య అని కృష్ణ మాట్లాడుతుంది. వెంటనే ప్రభాకర్ పోన్ తీసుకొని బాగున్నావా చెల్లెమ్మ అని అంటాడు. ఇక ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక.. కృష్ణని జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభాకర్ తో భవాని చెప్తుంది. ఎందుకని ప్రభాకర్ అడుగగా.. తను కడుపుతో ఉందని భవాని చెప్తుంది. ఇక ప్రభాకర్ అతని భార్య చాలా సంతోషిస్తారు. ఊరంతా చెప్పుకుంటూ మురిసిపోతారు. ఇదిలా ఉండగా ముకుంద కొత్త ప్లాన్ వేస్తుంది. ఆదర్శ్, ముకంద ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఏర్పాటు చేస్తాడు మధు. ఇక కాసేపు ఫోటోలు దిగాక కళ్ళు తిరిగి పడిపోతుంది ముకుంద. వెంటనే అందరు కలిసి బెడ్ రూమ్ కి తీసుకొస్తారు. ఇక దగ్గర్లో ఉన్న డాక్టర్ ని పిలిపిస్తుంది భవాని. ముకుందని చెక్ చేసిన డాక్టర్.. కంగారు పడాల్సిందేమి లేదని తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దాంతో ఇంట్లోని వాళ్ళంతా షాక్ అవుతారు.
ఇక రేవతి మరోసారి చెక్ చేయమని డాక్టర్ తో అంటుంది. తను ప్రెగ్నెంట్ కావాలంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళి చెక్ చేసుకోండి అని డాక్టర్ చెప్తుంది. ఏం వద్దులే అని భవాని అంటుంది. అది విని ఆదర్శ్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ఇదే అదును అని రజినీ నాలుగు సెటైర్లు వేస్తుంది. మరోవైపు కృష్ణ తలపట్టుకుంటుంది. ఏసీపీ సర్ కోసం రూపమే మార్చుకొని వచ్చింది. నా బిడ్డని తన కడుపులో మోస్తూ నా తాళికే ఎసరుపెట్టిందని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |